ఆ జాబితాలో అందరికంటే ముందంజలో ఏపీ
విద్యుత్ బకాయిల జాబితాలో అందరికంటే ముందంజలో ఆంధ్రప్రదేశ్ ఉందని తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడుతూ పేదలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వదట అని అన్నారు. జగనన్న కాలనీలతో విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి రూ.4,500 కోట్ల ఖర్చు అన్నారు. కనెక్షన్లపై సీఎంతో అధికారులు చెప్పినా డబ్బులు లేవన్నారట అని తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంచి జనాలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని పేర్కొన్నారు. జగనన్న కాలనీల్లో కనీస సౌకర్యాలు లేకపోతే వారెక్కడ ఉండాలని ప్రశ్నించారు.













