వారికి దోచి పెట్టడానికే ఈ నిర్ణయం : పట్టాభి
గంగవరం పోర్టు విక్రయంలో డైరెక్ట్ సేల్ విధానాన్ని ప్రభుత్వం ఎందుకు ఎంచుకుందో ప్రజలకు చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరంతర ఆదాయం వచ్చే పోర్టును కమీషన్ల కోసం అమ్మేశారని దుయ్యబట్టారు. అయిన వారికి దోచి పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మైనర్ పోర్టులను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గంగవరం పోర్టులో మన రాష్ట్రానికి 10.4 శాతం వాటా ఉందన్నారు. రుణభారం లేని పోర్టులోని రాష్ట్ర వాటా ఎందుకు అమ్మాల్సి వచ్చిందని ప్రశ్నించారు. లాభదాయక పోర్టులో రాష్ట్ర వాటా ఎందుకు అమ్ముతున్నారు అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెబుతున్న ప్రభుత్వం, గంగవరం పోర్టును ఎందుకు ప్రైవేటీకరణ చేశారో చెప్పాలి అని ప్రశ్నించారు.













