సీఐడీ చేసిన ఆరోపణ పచ్చి అబద్ధం : పట్టాభి
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌పై బురదజల్లి లక్షలాది యువత భవితను చీకట్లపాటు చేసేలా సీఐడీ వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఐడీ, తాడేపల్లి పెద్దల అడుగులకు మడుగులొత్తే చిత్తందొర డిపార్ట్మెంట్గా మారిందనడం నూటికి నూరుశాతం వాస్తవమన్నారు. సిమెన్స్ డిజైన్ టెక్ ఎటువంటి పరికరాలు సరఫరా చేయకుండా కోట్ల రూపాయాలు దిగమింగారన్న సీఐడీ ఆరోపణ పచ్చి అబద్ధమన్నారు. కాలేజీల్లో స్టాక్ రిజిస్టర్ల వివరాలు బయటకు వస్తాయనే ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్‌లో ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ తొలగించారని అన్నారు. అన్నీ సక్రమంగా ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు స్టాక్ రిజిస్టర్లలో సంతకాలు చేశాక స్కిల్ డెవలప్మెంన కార్పొరేషన్ చైర్మన్ అజయ్‌రెడ్డి ఎలా ఫిర్యాదు చేస్తారని ఆయన నిలదీశారు.













