కౌన్సిల్ చైర్మన్ గా ఫరూఖ్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ పదవి నంద్యాలకు చెందిన మాజీ మంత్రి ఎన్.ఎం.డి ఫరూఖ్‌ను వరించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సృష్టమైన సంకేతాలు ఇచ్చారు. నంద్యాల ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పుడే విజయం సాధిస్తే కౌన్సిల్ చైర్మన్ పదవిని ఇస్తానంటూ ముఖ్యమంత్రి ఫరూఖ్‌కు ఆఫర్ ఇచ్చారు. నంద్యాలలో మైనారిటీ లతోవిడిగా జరిగిన భేటీలోనూ మైనారిటీలు త్వరలో శుభవార్త వింటారంటూ బహిరంగంగా చెప్పడం జరిగింది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలంటూ కోరారు. ముఖ్యమంత్రి ఆశించినట్లుగానే నంద్యాలలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయకేతనం ఎగురవేశారు. మంగళవారం ఫరూఖ్ ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామని, కౌన్సిల్ చైర్మన విషయంలో మైనారిటీనే నియమిస్తానని నేరుగా ఫరుఖ్కు భరోసా ఇవ్వడం విశేషం. కాగా రాష్ట్ర మంత్రి వర్గంలో ముస్లిం మైనారీటీలకు మంత్రి పదవి కూడా లేదు. అయితే కనీసం కౌన్సిల్ పదవి ఇచ్చి అయినా వారికి తగిన గుర్తింపు ఇవ్వాలనే యోచనకు వచ్చారు. చివరకు నంద్యాలకు చెందిన నేతనే వరించబోతోంది.













