నంద్యాలలో టీడీపీ గెలుపు ఖాయం : ఫరూఖ్
నంద్యాల ఉపఎన్నికలో పోటీ చేసేందుకు వైకాపాకు అభ్యర్థి దొరకనందువల్లనే మా పార్టీ నుంచి తీసుకెళ్లారని ఎమ్మెల్సీ ఫరూక్ అన్నారు. శాసనమండలిలో ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శిల్పా మోహన్రెడ్డిది అసలు కర్నూల్ జిల్లానే కాదని, ఆయన కడప నుంచి వలస వచ్చారన్నారు. నంద్యాల ఎన్నిక దృష్ట్యానే కాను ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఖండించారు. ఎంపీగా, మూడుసార్లు మంత్రిగా పనిచేసిన తన సీనియారిటీని గుర్తించే ఈ పదవి ఇచ్చారని ఆయన తెలిపారు. నంద్యాలలో 40-50 వేల ఓట్ల మెజారిటో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని అన్నారు.













