2014 లోనే కాదు… ఇప్పుడు కూడా అదే జరుగుతుంది
ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా మైండ్ గేమ్‌లో జాతీయ మీడియా సంస్థలు సర్వేల పేరుతో హడావుడి చేస్తున్నాయని టీడీపీ నేత లంకా దినకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయేకు 200 సీట్లు దాటే అవకాశమే లేదని అన్నారు. 2014లో వైసీపీ 18 ఎంపీ సీట్లు గెలుస్తుందని జాతీయ మీడియా చెప్పిందని, కానీ ప్రజలు టీడీపీని ఆదరించారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. చాలా వరకు జాతీయ మీడియా సంస్థలు సర్వే చేశారనే నమ్మకం లేదన్నారు. జాతీయ మీడియా సంస్థల సర్వేలు తరచూ తారుమారవుతున్నాయని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం అని అన్నారు.













