రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి భంగపాటు తప్పదు
మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన అంశంపై తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఘాటుగా స్పందించారు. బాపట్ల జిల్లాలో అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా కనకమేడల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి భంగపాటు తప్పదని అన్నారు. చట్టసభలను వక్రీకరించేలా ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వలేదని, కేవలం దురుద్దేశంతోనే ఉన్నత న్యాయస్థానం తీర్పును వక్రీకరిస్తున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణం చేపట్టకుండా 6 నెలలు కాలయాపన చేసి ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లారని ఆయన మండిపడ్డారు.













