వైసీసీ అవుట్‌డేటెడ్ పార్టీ – దివ్యవాణి
ఆడపడుచుల ఆనందాన్ని ఓర్వలేక వైసీపీ విమర్శలు
ప్రతిపక్ష పార్టీకి పసుపు- కుంకుమ విలువ తెలుసా?
డ్యాక్రా మహిళలకు పసుపుకుంకుమ పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్న కానుకతో వారంతా సంతోషంగా ఉన్నారని అది చూసి ఓర్వలేక వైసీపీ నీచ రాజకీయాలు చేస్తోందని సినీనటి, టీడీపీ నాయకురాలు దివ్యవాణి వైసీపీపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పసుపుకుంకుమను విమర్శిస్తున్న వైసీపీ నాయకులకు ఆ పధానికి అర్దం తెలుసా అని ప్రశ్నించారు. కేంద్రం సహకరించకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచారని అన్నారు. లోటుబడ్జెట్లో సైతం మహిళలకు మెదటివిడత పసుపు కుంకుమ కింద ప్రతి డ్వాక్రా మహిళకు రూ. 10 వేలు ఇవ్వటంతోపాటు రెండో విడత కూడా ఇచ్చేందుకు 9,400 కోట్లు కేటాయించి మెదటి విడతగా రూ. 2500 అందజేశారని తెలిపారు. మిగతా రెండు విడతలు 08.03.2019న రూ.3500, 05.04.2019న రూ.4000 అందజేస్తారని తెలిపారు.
అనంతపురంలో పసుపు-కుంకుమ కార్యక్రమాన్ని అడ్డుకుని వైసీపీ రాష్ట్ర మహిళలను మెత్తం అవమానించదన్నారు. పేద ప్రజలకు అండగా నిలిచే పరిటాల కుటుంబంపై కిరాయి మనుషుల చేత వైసీపీ నాయకులు దాడికి ఉసిగొల్పటం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. మహిళలకు మేలు చేకూరే విధంగా అందజేస్తున్న పుసుపు కుంకుమను విమర్శిస్తున్న రోజాని ఏమనాలో అర్దం కావటం లేదన్నారు. రోజా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
పింఛను పెంపుతో ప్రజలందరూ ఆనందంగా ఉన్న సమయంలో దాని నుంచి దృష్టి మరల్చేందుకు వైసీపీ నేతలు ఎప్పుడో జరిగిన విషయాలపై షర్మిల చేత పోలీసు కంప్లైంట్ ఇప్పించారని అన్నారు. కోడికత్తి కేసుతో నాటకాలాడిన వైసీపీ మళ్లీ చేపకూర నాటకానికి తెరలేపినా ఆశ్చర్చం లేదంటూ పిట్టకధ చెప్పుకొచ్చారు.. చేపకూర తిని జగన్‌కి ముల్లు గుచ్చుకుంటే ఆ చేపని కూడా చంద్రబాబే పంపించారని వైసీపీ నేతలు చేపకూర నాటకానికి తెరలేపినా ఆశ్యర్చం లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ పార్టీ అవుట్‌డేటెడ్ పార్టీ అని ఆపార్టీకి ఎలా బుద్ది చెప్పాలో మహిళలకు తెలుసన్నారు. ప్రతిపక్షపార్టీ ఇకనైనా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై బురద చల్లే కార్యక్రమాలు మానుకోవాలని హితవు పలికారు.













