మాజీ ఎమ్మెల్యే చింతమనేని సంచలన వ్యాఖ్యలు …
తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులతో తనకు ప్రాణ హాని ఉందని కాబట్టి తనకు సీఆర్పీఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? నాపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు అని ఆరోపించారు. అక్రమ కేసుల సినిమా చూపించటంలో డీజపీ గౌతమ్ సవాంగ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను మించిపోయారు. రాష్ట్రంలో ఆర్థిక నేరగాళ్లు ఎందరో ఉండగా నా పేరే డీజీపీ ఎందుకు ప్రస్తావించారు అని ప్రశ్నించారు? 6093 ఆర్థిక నేరగాడి గురించి ప్రజలకు తెలిపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అని మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ క్యాడర్ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు నన్ను బంతిలా వాడుకుంటున్నారు. ఓ ఎస్సీ చింతమనేనిపై కేసులు పెట్టేందుకు ముందుకు రావాలంటూ 1+1 ఆఫర్లు ప్రకటించారు. నా తప్పుంటే ఉరి శిక్షకైనా సిద్ధమేనని అన్నారు. కేసులు తొలగించమని దేహీ అని ఎవర్నీ అడగలేదు. నేను వనజాక్షి సమీపంలో కూడా లేనని ఆమె ఫిర్యాదుల పేర్కొంటూ, అసెంబ్లీలో జగన్ రెడ్డి చెప్పిన కట్టుకథల్ని డీజీపీ వినిపించారు అని పేర్కొన్నారు.













