చంద్రబాబుకు తప్పిన ప్రమాదం
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రమాదం తృటిలో తప్పింది. యాద్రాది భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆవును తప్పించబోయి డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో కాన్వాయ్‌లోని జామర్ వాహనాన్ని ఎన్ఎస్జీ2 వాహనం ఢీ కొట్టింది. ఆ తర్వాతి వాహనంలోనే ఉన్న చంద్రబాబు క్షేమంగా ఉన్నారు. ఎన్ఎస్జీ వాహనం మొరాయించడంతో 15 నిమిషాలపాటు ఆయన రోడ్డుపైనే ఆగిపోయారు. అనంతరం స్పేర్ వాహనంలో సిబ్బంది ఎక్కారు. విజయవాడ నుంచి చంద్రబాబు హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.













