టీడీపీకి చల్లా రాజీనామా
తెలుగుదేశం పార్టీకి మరో నేత రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి తన పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయానికి పంపారు. తన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న చల్లా మరో మూడు రోజుల్లో వైసీపీ అధినేత జగన్ను కలిసి ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
గత ఎన్నికల్లో బనగానపల్లె నియోకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గెలుపునకు చల్లా రామకృష్ణారెడ్డి కృషి చేశారు. అయితే ఈసారి తనకు ఎమ్మెల్సీ పదవి కావాలని చంద్రబాబును కోరాగా వచ్చే దఫాలో అవకాశం ఇస్తామని, రాబోయే ఎన్నికల్లో జనార్దన్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని చంద్రబాబు చెప్పినట్పటికీ ఆయన పార్టీ మారుతున్నట్ట ప్రకటించడ గమనార్హం.













