లగడపాటి అంచనాలకు మించి టీడీపీకి సీట్లు
ఏపీ ఎన్నికలపై వచ్చి ఎగ్జిట్ పోల్స్ ఏవీ నిజం కావని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. లగడపాటి అంచనాలకు మించి టీడీపీకి సీట్లు వస్తాయని.. 130 స్థానాలు గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల ముందు కూడా వైకాపా నేతలు ఇంతకంటే ఎక్కువే ఊహల్లో తేలారని, అప్పుడు ఎగ్జిట్ పోల్స్‌కి భిన్నంగా రాష్ట్రంలో ఫలితం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. వైకాపా ఓడిపోతుందని జగన్‌కు కూడా తెలుసన్నారు. ఎగ్జిట్ పోల్స్‌పై తెలుగుదేశం శ్రేణులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, టీడీపీ గెలుపు ఖాయమని వివరించారు. జగన్‌తో కలిసి మోదీ మైండ్ గేమ్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబే ప్రమాణం చేసి సరికొత్త చరిత్ర సృష్టిస్తారని ఆయన జోస్యం చెప్పారు.













