ఒక రాజధానిని కట్టలేని వాళ్లు మూడు ఎలా?
అమరావతి రైతులకు దేశమంతా మద్దతు పలుకుతున్నా ముఖ్యమంత్రి జగన్ మనసు మారడం లేదని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. మందడంలో రైతులు చేపట్టిన 24 గంటల దీక్షకు ఉమా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి అమరావతిని చంపేయాలన్న కక్షపూరిత ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో అధికారులు వణికి పోతున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలను లెక్కచేయకుండా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తోందని ఆరోపించారు. ఒక రాజధానిని కట్టలని వాళ్లు మూడు రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు.













