ప్రజల్లో వస్తున్న మార్పు చూసి వైకాపాకు భయం : అయ్యన్నపాత్రుడు
ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత చూసి తట్టుకోలేకే చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. గుంటూరు జిల్లాకు వెళ్తే ప్రజలు ఘన స్వాగతం పలికారు. రెండున్నరేళ్లల్లో ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. వైకాపా బెదిరింపులకు మేం భయపడం. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నాం అని స్పష్టం చేశారు. ఇష్టానుసారం అప్పులు చేసి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని మండిపడ్డారు.













