మూడు రాజధానుల కుట్రతో.. ప్రాంతీయ చిచ్చు
విశాఖలో భూఅక్రమాలపై సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించగలరా? అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 రాజధానుల కుట్రతో సీఎం జగన్ ప్రాంతీయ చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతిచ్చిన సంగతి మరిచారా? అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అర్థమేంటో జగన్ రెడ్డికి తెలుసా? అని నిలదీశారు. సీఎం జగన్ అధికారంలోకి రాకముందు, వచ్చాక కూడా అన్నీ అబద్ధాలే చెబుతున్నారని ధ్వజమెత్తారు.
మూడున్నర ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గడపగడపలో ఎదురవుతున్న చీపుర్ల సత్కారాలే మూడేళ్ల పాలనకు నిదర్వమని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు, రైల్వే జోన్ వంటి అంశాలపై మంత్రులు ఎందుకు రాజీనామా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా రైతులు పాదయాత్ర చేస్తుంటే ప్రభుత్వానికి ఉలుకెందుకుని దుయ్యబట్టారు.













