టీడీపీలో జోష్!
పసుపు-కుంకుమ సంబరం
చెక్కులు అందె..ఆనందం వెల్లివిరిసె..
సంప్రదాయ వేడుకలా సాగిన చెక్కుల పంపిణీ
భారీగా హాజరైన డ్వాక్రా మహిళలు
ర్యాలీలు, పాలాభిషేకాలు, బాణసంచా చప్పుళ్లతో పండగ
• రాష్ట్రమంతటా సంక్షేమ సందడి.. వెల్లువెత్తిన మహిళల ఉత్సాహం
• ఓ మహిళ ఆనందభాష్పాలు,
• సీఎం సభకు వచ్చిన మహిళలు
• గ్రామ గ్రామాన సంక్రాంతి కళ
• పొద్దున్నే సందడి మొదలు.. పొద్దుపోయేదాకా తగ్గని ఉత్సాహం
• లక్షలాది ఆడపడుచులకు అందిన ప్రభుత్వ పసుపు కుంకుమ
• లక్షల్లో రెట్టింపు పెన్షన్లు పంపిణీ.. సీఎం ఫొటోలకు క్షీరాభిషేకాలు
• కొత్త వస్త్రాలు, భోజనాలు పెట్టి పలుచోట్ల మహిళలకు గౌరవం
• మహిళల స్పందనతో నేతల్లో ఆనందం
• నియోజకవర్గాల్లోనే ప్రజా ప్రతినిధులు
• పంపిణీ సభల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు
• ఎన్నికల ముందు రాజకీయ ఉత్సాహం
• సంక్రాంతికి అందం ఆడపడుచులు.
• స్వయంసహాయక సంఘ మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం శనివారం చేపట్టిన రెండో విడత పసుపు-కుంకుమ సాయం పంపిణీ సంబరం అంబరాన్ని తాకింది.
• గ్రామగ్రామాన పండగ వాతావరణంలో చెక్కుల పంపిణీ సాగింది. సభావేదికల వద్ద రంగవల్లులు, పూలతోరణాలు, కోలాటాలు, చెక్కభజనలతో హడావుడి కనిపించింది.
• ఎక్కడికక్కడ భారీ ర్యాలీలు నిర్వహించారు. బాణసంచా పేలుళ్లు వినిపించాయి. డ్వాక్రా మహిళలు భారీగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు.
• ‘చంద్రన్న నిన్ను మరవం’ అన్న నినాదాలు మిన్నంటాయి. ఇంట శుభకార్యానికి వచ్చిన మహిళలను గౌరవించే విధంగా ప్రతి డ్వాక్రా సభ్యురాలికి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలమిచ్చి పల్లెంలో పూలు, స్వీట్, హాట్తోపాటు సాయం చెక్కుకు, ముఖ్యమంత్రి సందేశపత్రాన్ని జత చేసి ఇచ్చారు.
• కొన్ని చోట్ల చీరె, రవికెలు, గాజులు, పండ్లు కూడా ఇచ్చారు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు భోజనాలు పెట్టించారు. శుక్రవారమే సంఘ నాయకురాళ్లు సభ్యుల ఇళ్ల వద్దకెళ్లి మహిళల నుదుట బొట్టు పెట్టి వేడుకకు ఆహ్వానించారు.
• రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ‘పసుపు-కుంకుమ’ చెక్కులను అందుకోడానికి డ్వాక్రా మహిళలు ఒక్కసారిగా తరలిరావడంతో, సర్వత్రా మరోసారి సంక్రాంతి కళ వెల్లువెత్తింది.
• మహిళల ఉత్సాహంతో చెక్కుల పంపిణీ సభలు ఉత్సవ వాతావరణాన్ని తలపించాయి.
• ఈ కార్యక్రమంతో గ్రామాలకు పండగ కళ వచ్చింది.
• కడప జిల్లా ఎర్రగుంట్ల ప్రాంత మహిళలు, పింఛనుదారులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం జరిపారు.
• పలు చోట్ల చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం జరిపారు. స్వీట్లు పంచుకొని నోరు తీపి చేసుకొన్నారు.
• తమకు ‘పసుపు-కుంకుమ’ను అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కటౌట్లు ఏర్పాటుచేసి కొందరు తమ అభిమానం చాటుకొంటే, మరికొందరు సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు జరిపి తమ సంతోషం ప్రకటించారు.
• రెట్టింపు చేసిన పింఛన్లు అందుకోవడానికీ, ప్రభుత్వ సాయం తీసుకోవడానికీ కుటుంబాలకు కుటుంబాలు కదిలి రావడం అంతటా కనిపించింది.
• రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ‘పింఛన్ల పండుగ’ తెలుగుదేశం పార్టీకి సరికొత్త జోష్‌ను తీసుకొచ్చింది.
• ‘పసుపు కుంకుమ’ పంపిణీ మునుపెన్నడూ లేనంత ఉత్సాహాన్ని నింపింది.
• పల్లెల్లో వార్డు సభ్యుడి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చివరాఖరికి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు టీడీపీ ప్రజాప్రతినిధులంతా శనివారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
• కృష్ణాజిల్లా గన్నవరంలో సీఎం చంద్రబాబు పాల్గొన్న పసుపు-కుంకుమ కార్యక్రమంలో భాగంగా, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సుమారు 40-50 వేలమందికి భోజనాలు పెట్టారు. వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు కలిసి మొత్తం ఈ జిల్లాలో 82 వేలమందికి పింఛన్లు అందించగా, ఒక్కరోజే రెండు లక్షలమంది ‘పసుపు-కుంకుమ’ అందుకొన్నారు.
• మహిళలు, పేదలైన లబ్ధిదారులు భారీగా తరలిరావడం… ప్రభుత్వ సహాయాన్ని అందుకుని మురిసిపోవడం… ముఖ్యమంత్రిని నిండు మనసుతో ఆశీర్వదించడం చూసి టీడీపీ నేతలు పొంగిపోతున్నారు.
• వృద్ధులు, వితంతవులు, వికలాంగులు, వివిధ వృత్తి పనివారి పింఛన్లను ప్రభుత్వం రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే.
• జనవరి నెల బకాయి కూడా కలిపి ఫిబ్రవరి పింఛన్‌ను శని, ఆది, సోమవారాల్లో చెల్లించాలని నిర్ణయించారు.
• అంటే… వృద్ధులు, వితంతువులకు రూ.3వేలు, వికలాంగులకు రూ.4500 అందిస్తున్నారు.
• అలాగే… ‘పసుపు కుంకుమ’ కింద డ్వాక్రా సభ్యులకు అదనంగా రూ.10వేలు పెట్టుబడి సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని మూడు చెక్కుల కింద ఇస్తున్నారు.
• ఒక చెక్కును ఇప్పటికిప్పుడు తక్షణం మార్చుకోవచ్చు. మిగిలిన రెండు చెక్కుల్లో ఒక దానిని మార్చి 8న, ఇంకొకటి ఏప్రిల్ 5న మార్చుకోవచ్చు.
• మొత్తం మూడు చెక్కులను ఒకేసారి అందిస్తున్నారు. అటు పెరిగిన పింఛన్ల చెల్లింపు, ఇటు డ్వాక్రా మహిళలకు మూడు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఒకేసారి చేపట్టారు.
• ప్రతి గ్రామం, వార్డులో చిన్న సభ ఏర్పాటు చేసి వీటిని అందిస్తున్నారు.
• మొత్తం గ్రామాలు, పట్టణాల్లోని వార్డులు, డివిజన్లను మూడు విభాగాలుగా వర్గీకరించారు.
• ఈ మూడు రోజుల్లో ఒక్కో రోజు ఒకోచోట వీటిని పంపిణీ చేస్తున్నారు.
• ఉల్లాసం… ఉత్సాహం!
• పెరిగిన పింఛన్లు 54 లక్షల మందికి వర్తిస్తున్నాయి. డ్వాక్రా కానుక 94 లక్షల మందికి అందుతోంది.
• ఈ రెండు పద్దుల కింద ఒక్క ఏడాదిలో ప్రభుత్వం రూ.21 వేల కోట్లు ఖర్చు చేస్తోంది.
• ఇంత భారీ సంఖ్యలో లబ్ధిదారులకు సాయం అందడం గ్రామాల్లో రాజకీయ వాతావరణాన్నే మార్చేసిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
• అంతకు ముందు పోటీ చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్న కొందరు నేతలు కూడా ఇప్పుడు ఉత్సాహంగా తాము మళ్లీ పోటీ చేస్తున్నామని బహిరంగ ప్రకటనలు చేయడాన్ని వారు ఉదహరిస్తున్నారు.
• ఈ కార్యక్రమాన్ని సొంతం చేసుకోవడానికి టీడీపీ నేతలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు.
• గుంటూరు జిల్లా గురజాల మండలంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.. డ్వాక్రా మహిళలకు చెక్కులతో పాటు, నూతన వస్ర్తాలను కానుకగా అందించారు.
• మొత్తం 6,600 మంది ఆయన చేతుల మీదుగా కొత్త బట్టలు అందుకొన్నారు. అనంతరం వారందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు.
• పసుపు కుంకుమ, ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమం మొదటి రోజు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రచ్చరచ్చగా సాగింది.
• ఎమ్మెల్యే హోదాలో ఈ సభకు వచ్చిన చెవిరెడ్డి వైసీపీ అజెండా గురించి ప్రచారం చేయడంతో టీడీపీ కార్యకర్తలే కాకుండా పలువురు మహిళలు కూడా ఆయనను నిలువరించారు.
• అలాగే, ప్రభుత్వం చేపట్టిన ‘పసుపు కుంకుమ’ కు పోటీగా వైసీపీ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి డబ్బులు పంపిణీ చేయడం వివాదానికి దారి తీసింది.
• గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్ శంకరమ్మ పాల్గొని.. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం జరిపారు.
• అలాగే, విశాఖలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.













