Sakshi: ఏలూరు అగ్నిప్రమాదానికి సాక్షికి సంబంధం లేదు.. స్పష్టత ఇచ్చిన పోలీసులు..

ఏలూరు (Eluru) పట్టణంలో జరిగిన అగ్నిప్రమాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మొదట ఇది సాక్షి (Sakshi) మీడియా కార్యాలయానికి పెట్టిన నిప్పేనని ప్రచారం జరిగినా, తర్వాత నిజాలు ఒక్కొటిగా వెలుగులోకి వచ్చాయి. కొన్ని రాజకీయ పార్టీలు దీనిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, తమపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని విమర్శలు చేశారు. అయితే పోలీసులు జరిపిన విచారణ అనంతరం అసలు విషయం బహిర్గతమైంది.
ఈ ఘటనలో సాక్షి కార్యాలయానికి నేరుగా సంబంధం లేదని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ (Sharavan Kumar, DSP Eluru) స్పష్టంగా తెలిపారు. ఆ ప్రాంతంలో గల ఒక ఫర్నిచర్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయని, అది రిపేర్ ఫర్నిచర్ షాప్ అని చెప్పారు. అగ్నిప్రమాద సమయంలో అక్కడ మంటలు అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది కృషి చేశారు. అనంతరం, దెందులూరు (Denduluru) నియోజకవర్గానికి చెందిన మహిళలు తమ నిరసన కార్యక్రమంలో భాగంగా అక్కడికి ర్యాలీగా చేరుకున్నారని పోలీసులు చెప్పారు. కానీ, వారు ర్యాలీగా వచ్చేసరికి మంటలు అప్పటికే ఆర్పివేసినట్లు ఉన్నాయని, ఈ విషయం వీడియోలలో స్పష్టంగా కనిపించిందని చెప్పారు.
ఈ ఘటనపై కొన్ని సోషల్ మీడియా వేదికలలో సాక్షి కార్యాలయం టార్గెట్ అయిందని, రాజకీయ కక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం జరగడం చూసి పోలీసులు ఖండించారు. అసత్య ప్రచారాలు చేస్తే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఫర్నిచర్ షాప్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ భవనం పై అంతస్థులో సాక్షి రిపోర్టింగ్ విభాగం ఉన్నప్పటికీ, మంటలు ఆ స్థాయికి చేరలేదు. ఇది పూర్తిగా భవనంలో కింద ఉన్న ఫర్నిచర్ గోడౌన్‌లోనే జరిగింది. అయినా కూడా కొన్ని వర్గాలు దీనిని రాజకీయం చేయడమే కాక, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించాయని టీడీపీ (TDP) నేతలు అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూస్తే, ఇది స్వభావికమైన ప్రమాదమే తప్ప రాజకీయ కుట్ర కాదని స్పష్టమవుతుంది.