టీడీపీ ఆవిర్భావ వేడుకలు
కరోనా ఆంక్షల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. పలువురు నేతలు సైతం తమ ఇళ్లలోనే ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. అనంతరం తెలుగురాష్ట్రాల నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నంచి ఎదురైన అనుభవాలు, చేసిన కృషిని ఈ సందర్భంగా వారు వివరించారు. విపత్తుల సమయాల్లో టీడీపీ ప్రజలకు పలురకాలుగా సాయపడిందని, గుర్తుచేశారు. అదే స్ఫూర్తిని ప్రస్తుత అవత్కాలంలోనూ కనబర్చాలని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సహకరించాలని చంద్రబాబు వారికి సూచించారు.













