జనసేనలోకి మాజీమంత్రి ?
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రావెల కిషోర్‌బాబు జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. రాష్ట్రం విడిపోయాక తొలి తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. గత కొంతకాలంగా ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబరు 1న జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. ఆయన అనుచరులు, మిత్రులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే జనసేనాని పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకొనేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయన పవన్ కల్యాణ్‌తో రెండు దఫాలుగా భేటీ అయినట్లు తెలిసింది. ఇద్దరి మధ్య ఒక అవగాహన వచ్చిన అనంతరం డిసెంబరు 1న విజయవాడలో ఆయన పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలిసింది.













