ఈ ఘటనకు పోలీసులదే బాధ్యత : ధూళిపాళ్ల
వైసీపీ అరాచక శక్తులు మాజీ జడ్పీటీసీ ఇంటిపై దాడి చేశాయని, ఇందులో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో టీడీపీ నాయకురాలు శారదా ఇంటిపై రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో టీడీపీ నేతల బృందం గ్రామంలో పర్యటించింది. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ కొప్పర్రులో పోలీసులు వైఫలం కన్పిస్తోందన్నారు. ఈ దాడి ఘటనకు పోలీసుదే బాధ్యత అన్నారు. దాడి జరిగే అవకాశం ఉందని పోలీసులకు ముందే చెప్పినా పట్టించుకోలేన్నారు. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. స్థానిక వైకాపా నేతలకు పోలీసులు వత్తాసు పలికారు. భవిష్యత్లో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దాడి ఘటన బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు. తగలబెట్టిన ద్విచక్ర వాహనాలను పోలీసులు ఎక్కడకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. బాధితులను స్టేషన్కు రమ్మని పోలీసులు బెదిరిస్తున్నారన్నారు.













