ప్రభుత్వ పెద్దల సహకారం లేనిదే.. ఇది జరిగిందా? : ధూళిపాళ్ల
నెల్లూరు కోర్టులో దొంగతనం కేసులో ఎస్పీ కల్పిత కథ బాగా అల్లారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 కేసుల్లోని నిందితులు కుక్కలు మొరిగితే భయపడతారా అని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చోరీలో పోలీసులు, కోర్టు ఉద్యోగుల ప్రమేయం ఉందా? ప్రభుత్వ పెద్దల సహకారం లేనిదే చోరీ జరిగిందా? అన్నారు. కాకిణి మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే అరాచకమా? ఏడు కేసుల్లో కాకాణి ముద్దాయిగా ఉన్నారు. సోమిరెడ్డి ప్రతిష్ఠ దిగజార్చాలని కాకాణి ఆరోపణలు చేశారు. అక్రమ ఆధారాలపై సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో కాకాణి గోవర్థన్ రెడ్డి ఏ1 అని అన్నారు.













