ఉపరాష్ట్రపతిని కలిసిన టీడీపీ నేతలు
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని తెలుగుదేశం పార్టీ నేతలు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈఎస్ఐ ఆస్పత్రి విషయంతో సహా పలు స్థానిక సమస్యలను ఉపరాష్ట్రపతి దృష్టికి నేతలు తీసుకెళ్లారు. వెంకయ్య నాయుడుకి ఈ ప్రాంతం మీద ఉన్న అభిమానం దృష్ట్యా స్థానికంగా ఉన్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లామని.. అందుకు వెంకయ్య సానుకూలంగా స్పందించారని టీడీపీ నేతలు తెలిపారు. ఉపరాష్ట్రపతి కలిసిన వారిలో అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ, బుద్ద నాగ జగదీశ్వరరావు, పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఉన్నారు.













