అసెంబ్లీ బహిష్కరణకు.. టీడీపీ నిర్ణయం

ఆంధప్రదేశ్ శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఒక రోజు జరిపే అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరు కాలేమని తెలుగుదేశం పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఆరు నెలల సమావేశాలు నిర్వహించకపోతో ప్రభుత్వం కుప్ప కూలుతుందన్న ఆందోళనతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలుగుదేశం శాసనసభా పక్ష ఉప నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. 2.11 లక్షల బడ్జెట్‍పై విపులంగా చర్చ జరగాలన్నారు. తూతూ మంత్రంగా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తప్పుబట్టారు. అందుకే సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించామని అచ్చెన్నాయుడు తెలిపారు.
కరోనా యాక్టివ్ కేసులు ఉన్న సమయంలో అసెంబ్లీ సమావేశాలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. మార్చిలో కేవలం రోజువారి కరోనా పాజిటివ్ కేసులు 900 కేసులు ఉంటే అప్పుడెందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. సమావేశాలను బహిష్కరించడం ద్వారా తమ పార్టీ సముచిత నిర్ణయం తీసుకుందని ఏపీ శాసన మండలి తెలుగుదేశం పక్షనేత యనమల రామకృష్ణుడు తెలిపారు. సమావేశాల్లో బడ్జెట్‍పై చర్చ లేకుండా ఆమోదించే ప్రయత్నం ఏమి•ని ప్రశ్నించారు.