సోమిరెడ్డిని పరామర్శించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సోమిరెడ్డి, కొన్ని రోజులు ఆసుపత్రిలో అడ్మిట్ అయి, ఇటీవలే డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసింది. ప్రస్తుతం సోమిరెడ్డి, హైదరాబాద్లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, ఇతర నేతలతో కలిసి సోమిరెడ్డి ఇంటికి వచ్చిన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. త్వరగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.













