సమసమాజ నిర్మాణానికి పునరంకితమవుదాం : చంద్రబాబు
దేశ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను చంద్రబాబు ఎగురవేశారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్ర పటాల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అంబేడ్కర్ వంటి మహనీయుల ఆదర్శాలు, ఆకాంక్షల నుంచి మన రాజ్యాంగం ఊపిరి పోసుకుందన్నారు. ఈ శుభవేళ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు, సమసమాజ నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.













