ఇకపై జన్మలో ఆయన సీఎం కాలేరు : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదవికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది, ఇకపై జన్మనలో ఆయన సీఎం కాలేరు అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు ఐకమత్యంతో పని చేయాలని పిలుపునిచ్చారు. బంధువులు, రక్త సంబంధీకులు వదిలేసినా పార్టీ వెంట ఉంటుందని కార్యకర్తలకు సూచించారు. టీడీపీ పాలన వల్ల విదేశాల్లో స్థిరపడిన వారంతా పార్టీకి విరాళాలు ఇవ్వాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రూ.5 వేలు విరాళం ఇచ్చిన వారికి జీవితకాల సభ్యత్వం ఇస్తామని, కార్యకర్తలను ఆదుకునే బాధ్యత పార్టీదే అని తెలిపారు. జగన్ ఎక్కడ ఉంటే అక్కడ శనే. జగన్ ఓ ఐరన్‌లెగ్. అమరావతిని నాశనం చేశారు. ఇప్పుడు విశాఖ నుంచి పాలిస్తానని చెబుతున్నారు. ఆయన్ను చూసి విశాఖ వాసులు భయపడుతున్నారు అని అన్నారు.













