సీఎం చంద్రబాబు నివాసంలో సంబరాలు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందిన విషయం తెలిసిందే. 30 ఏళ్ల తర్వాత కాకినాడలో విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ గెలుపునకు కృషిచేసిన ప్రతిఒక్కరినీ ముఖ్యమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేక్ కట్ చేశారు. పలువురు నేతలకు మిఠాయిలు పంచుతూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కళా వెంకట్రావు, నారాయణ, ప్రతిపాటి పుల్లారావు, టీడీపీ నేతలు గద్దె రామ్మోహన్, టీడీ జనార్ధన్, వీవీవీ చౌదరి పాల్గొన్నారు.













