జోరుగా మహానాడు ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా విశాఖలో ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న మహానాడుకు సంబంధించి ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఎయూ ఇంజనీరింగ్కాలేజీ గ్రౌండ్స్‌లో జరగనున్న మహానాడు ఏర్పాట్లను రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పరిశీలించి ఈ మేరకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. మహానాడును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పర్యనటలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, అర్బన్ కమిటీ ప్రధాన కార్యదర్శి చోడె వెంకట పట్టాభిరామ్, మాజీ కార్పొరేటర్ పైలా ముత్యాలనాయుడు తదితరులు పాల్గొన్నారు.













