33 ఏళ్ల తర్వాత భూమా, ఇరిగెల మైత్రి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఆళ్లగడ్డకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ చోటు చేసుకున్న కీలక పరిణామం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. 33 సంవత్సరాల తరువాత ఆళ్లగడ్డపై భూమా, ఇరిగెల కుటుంబాలు ఒకటయ్యాయి. నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి తండ్రి చొరవతో రెండు కుటుంబాల మధ్య తిరిగి మైత్రి మొదలైంది. ఈ రెండు కుటుంబాల కలయికతో ఆళ్లగడ్డలో కూటమికి బలం రెట్టింపు అయింది. పార్టీలు పక్కన పెడితే ఆళ్లగడ్డ రాజకీయం లో భూమా, గంగుల, గిరిజన, ఎస్వీ వర్గాలు కీలక పాత్ర పోషిస్తాయి. 1992 ఆళ్లగడ్డ లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున భూమా నాగిరెడ్డి గెలవడంలో ఇరిగెల కుటుంబం పాత్ర చాలా ఉంది. నేడు మళ్ళీ 33 సంవత్సరాల తరువాత ఈ రెండు కుటుంబాలు ఒకటయ్యాయి…దీంతో ఆళ్లగడ్డలో వారు వన్ సైడ్ అయిపోయింది అన్న టాక్ వినిపిస్తోంది.













