టిడిపి గెలుపు చారిత్రక అవసరం
టిడిపి ద్వారానే ఆంధ్రప్రదేశ్ నిర్మాణం
విశాఖ,విజయనగరం,కృష్ణా,గుంటూరు జిల్లాల నుంచి
భారీగా ప్రజావేదికకు తరలివచ్చిన టిడిపి కార్యకర్తలు
ప్రజావేదికలో టిడిపి కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు
మనం అందరం పరుగు పందెంలో ఉన్నాం: ముఖ్యమంత్రి చంద్రబాబు
ఎన్నికల యుద్ధం ఆరంభం అయ్యింది.
ఈ యుద్ధానికి తెలుగుదేశం పార్టీ సంసిద్ధంగా ఉంది.
అన్ని స్థాయిల్లో టిడిపి శ్రేణులు సర్వ సన్నద్ధంగా ఉన్నారు
అభ్యర్ధుల ఎంపిక పూర్తికావచ్చింది. అనేక సర్వేల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ
ప్రజలకు ఆమోద యోగ్యంగా ఉండాలి. కార్యకర్తల అభిమానం పొంది ఉండాలి
వాస్తవాలకు దగ్గరగా అభ్యర్ధుల ఎంపిక. అన్నివిధాలా మెరుగైన అభ్యర్ధులనే ఎంపిక.
టిడిపి గెలుపు చారిత్రక అవసరం. టిడిపి ద్వారానే ఆంధ్రప్రదేశ్ నిర్మాణం
గత 5ఏళ్లుగా ఎంతో కష్టపడ్డాం, చరిత్రలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి చేశాం. అన్నివర్గాల పేదలకు సంక్షేమం అందించాం
అభివృద్ధి చెందిన రాష్ట్రాలకన్నా మనమే ముందున్నాం.
అన్నిస్థానాలలో గెలిస్తే పరిపాలన సులభతరం అవుతుంది.
25ఎంపీ సీట్లు, 150పైగా అసెంబ్లీ స్థానాల్లో టిడిపి విజయం సాధించాలి.
వైఎస్సార్ కాంగ్రెస్ లో ‘వేలం’ ప్రకారం అభ్యర్ధుల ఎంపిక
పాటపెట్టి ఎవరెక్కువ డబ్బులు పెడితే వాళ్లకే వైకాపా టిక్కెట్టు
ఒకరోజు 10కోట్లు పెట్టే అభ్యర్ధికి, రెండవరోజు 20కోట్లు పెట్టే అభ్యర్ధికి, తరువాత రోజు మరింత….
ఇలా ఆక్షన్ పెట్టి టిక్కెట్లు ఇచ్చే పార్టీ దేశంలో వైకాపా యే
ఎవరికి సీట్లు వస్తాయో వైసిపిలో చెప్పలేని దుస్థితి
ప్రజాసేవే టిడిపి అభ్యర్ధుల ఎంపికకు ప్రామాణికం
ప్రజాభిప్రాయం తీసుకుంటాం. కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటాం
ఆ తరువాతే అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్ధుల ఎంపిక
గాలికి వచ్చినాళ్లు గాలికే పోయే పరిస్థితి.
వాళ్లే వచ్చారు, వాళ్లే వెళ్లారు.
అక్కడికి వెళ్లి దిక్కుతోచకుండా ఉన్నారు.
మళ్లీ టిడిపిలోకి వస్తామంటున్నారు.
మళ్లీ ఇక్కడకు రావాలన్నా వద్దని చెప్పాను.
రోజురోజుకూ టిడిపి గ్రాఫ్ పెరుగుతోంది.
95లక్షల మంది మహిళలకు ‘పసుపు-కుంకుమ’ ఇచ్చాం
70లక్షల రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం ఇస్తున్నాం
లక్షలాది మందికి యువనేస్తం భృతి ఇస్తున్నాం
రైతులు,మహిళలు,యువతరమే టిడిపికి పునాదులు
మీ ముందరే మీ అభ్యర్ధుల సమాచారం పెడతాను.
మళ్లీ విచారించమంటే ఇంకోసారి ఎంక్వైరీ చేస్తాను.
ఎవరిని అభ్యర్ధులుగా ఎంపిక చేసినా గెలిపించాల్సిన బాధ్యత మీదే
మరో రెండు మూడు రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేస్తాం
తిరుపతి నుంచే మన ఎన్నికల సమర శంఖారావం పూరిస్తాం
దైవ దర్శనం అనంతరం ప్రజల్లోకి దూసుకుపోతాం
శ్రీకాకుళం నుంచి ఎన్నికల ప్రచారం ఆరంభిస్తాం.
టిడిపిలో అనైక్యతకు తావులేదు, భేదాభిప్రాయాలకు తావులేదు
‘మీ భవిష్యత్తు- నా బాధ్యత’ మన నినాదం
‘మీ జైలుకు- నా భరోసా’ అనేది జగన్ నినాదం
మూడు పార్టీల మహాకుట్రలను ఎదుర్కోవాలి.
మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించం













