తెలుగుని అవమానపరిచే విధంగా.. ఈ నిర్ణయం
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలుగుని అవమానపరిచే విధంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని, రానున్న రోజుల్లో ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. తుగ్లక్ ముఖ్యమంత్రి కావడం వల్ల అన్ని వ్యవస్థలు ఏవిధంగా నిర్వీర్యం అవుతున్నాయో చూస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్ పతనానాకి కారణమే లక్ష్మీ పార్వతి అని ఆరోపించారు. ఎన్టీఆర్ మరణం తర్వాత పార్టీ పతనం అవ్వకుండా ఉండేందుకు చంద్రబాబు పార్టీ పగ్గాలు తీసుకున్నారని తెలిపారు. చంద్రబాబు పార్టీ పగ్గాలు తీసుకున్నారు కాబట్టే పార్టీ బ్రతికి ఉందని లేదంటే లక్ష్మీ పార్వతి నీడలో పార్టీ కలిసిపోయేదని అన్నారు.













