ఏపీలో బాధ్యతలు స్వీకరించిన మంత్రులు …
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా తానేటి వనతి సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా విడదల రజిని బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగ నాగార్జున సచివాయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా కొట్టు సత్యనాjరాయణ బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు అనంతరం బాధ్యతలు చేపట్టారు.













