రాజకీయాలు చేయాలనుకుంటే.. స్పీకర్ పదవికి
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని రాజకీయాలు చేయాలనుకుంటే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆనాడు నేను ఉన్నాను నేను విన్నాను అన్నారు, నేడు నేను మర్చిపోయాను అంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై అరాచకాలకు పాల్పడుతోందన్నారు. సామాజిక న్యాయం పేరుతో మంత్రులు ఊరేగుతున్నారన్నారు. అసెంబ్లీ స్పీకర్ కూడా అందులో ఉపన్యాసాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. అమలాపురంలో అల్లర్లు సృష్టించారు. అల్లర్లు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా కావాలని చేసిన పనా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ చేతగానితనంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్లు అతికించుకునే పని చేస్తోందని ఎద్దేవా చేశారు.













