ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారామ్‌ను నియమిస్తున్నట్టు సమచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని తమ్మినేని కలిసినట్టు తెలుస్తోంది. కాగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి తమ్మినేని గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. కళింగ (బీసీ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తమ్మినేని. కేబినెట్లో బడుగు, బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తానని జగన్ చెప్పడం తెలిసిందే. స్పీకర్ పదవిని కూడా ఆ వర్గాలకే కేటాయిస్తారనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో జగన్ ని తమ్మినేని కలవడం గమనార్హం.













