కెనడాకు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం
కెనడాలో ఈ నెల 22 నుంచి 26 వరకు జరగనున్న 65వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఆదివారం (21వ తేదీ) కెనడాకు వెళ్లనున్నారు. ఉదయం ఢిల్లీకి వెళ్లి అదే రోజు సాయంత్రం అక్కడి నుంచి కెనడాకు వెళ్లనున్నారు. ఈ నెల 24న సదస్సులో పీపుల్స్ పార్లమెంట్ అనే అంశంపై జరిగే చర్చలో పాల్గొంటారు. 26వ సదస్సు పూర్తవుతుంది. సదస్సు అనంతర అధ్యయన యాత్రలో భాగంగా మూడు నాలుగు రోజులపాటు ఇతర దేశాల్లో పర్యటించనున్నారు. సెప్టెంబరు 1న రాత్రి ఢల్లీికి చేరుకుని అక్కడి నుంచి మరుసటి రోజు విశాఖకు రానున్నారు.













