అవకాశమిస్తే అన్ని రంగాల్లోనూ అగ్రస్థానం : గవర్నర్ తమిళిసై
మహిళలకు అవకాశమిస్తే అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో ఉంటారని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతరిక్షంలో మహిళలు అంశంపై అమె మాట్లాడారు. ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొని ముందుకెళుతున్నారంటూ మహిళా శాస్త్రవేత్తలను అభినందించారు. అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా షార్ ఆధ్వర్యాన ఏపీ, తెలంగాణ తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరిలలో విద్యార్థులకు అన్లైన్లో వివిధ పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అంతరిక్షంలో మహిళల విజయప్రస్తానాన్ని ఆమె వివరించారు. మనముందున్న సవాళ్లను భవిష్యత్ తరాలు అధిగమించాలని సూచించారు.













