ఏపీ లో వైసీపీ ఖాళీ.. నారా లోకేష్..
ఆంధ్రాలో ఎన్నికల టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో టిడిపిలో చేరికల జోరు పెరిగింది. ఈరోజు ఉండవల్లిలో నారా లోకేష్ సమక్షంలో పార్టీలో భారీ చేరికలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా గుంటూరు అనంతపురం జిల్లాలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన నేతలలో గుంటూరుకు చెందిన తాడిశెట్టి మురళీమోహన్ కూడా ఉన్నారు. నారా లోకేష్ సమక్షంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఈరోజు పసుపు కండువా కప్పుకున్నారు. తాడిశెట్టి మురళి మరెవరో కాదు గతంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు సోదరుడు. గతంలో మురళి డిప్యూటీ మేయర్ గా కూడా పనిచేశారు. రీసెంట్ గా అరిసెట్టి బ్రదర్స్ ఇద్దరు కూడా వైసీపీ ను వీడి బయటకు వచ్చారు. ఈరోజు తాడిశెట్టి మురళీమోహన్ తో పాటు ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీ లోకి చేరారు. లోకేష్ వీరందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైసీపీ ఏపీని ఖాళీ చేసి పారిపోయే పరిస్థితి వచ్చిందని లోకేష్ అన్నారు.













