ఏపీ సమాచార కమిషనర్ ల ప్రమాణ స్వీకారం

ఆంధప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ లుగా ఉల్చాల హరిప్రసాదరెడ్డి, కాకర్ల చెన్నారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వారితో ప్రమాణం చేయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం మరింత పటిష్టంగా అమలుకు నూతన కమిషనర్లు కృషి చేయాలి. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించటం ద్వారా చట్టం అమలుపై వారిలో నమ్మకాన్ని పెంపొందించటానికి కృషి చేయాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమిషన్ ముఖ్య సమాచార కమిషనర్ పి.రమేశ్‍కుమార్, సమన్వయకర్తలు బీవీ రమణకుమార్, కట్టా జనార్ధనరావు, ఆర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.