సీఎం జగన్ తో స్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ సభ్యుల భేటీ
స్వామి నారాయణ్ గురుకుల్ ట్రస్ట్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. వచ్చే నెలలో తిరుపతిలో జరగనున్న స్వామి నారాయణ్ పాఠశాల భూమిపూజ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ట్రస్ట్ ప్రతినిధులు సుఖ్వల్లభ్స్వామి, ధర్మ్సాగర్ స్వామి ఆహ్వాన పత్రికను జగన్కు అందజేశారు. పాఠశాల నిర్మాణానికి తిరుపతి, పులివెందుల, విశాఖపట్నంలలో భూములు కేటాయించడంపై సీఎంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ట్రస్టు ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ భూమి పూజకు రావడానికి ముఖ్యమంత్రి జగన్ అంగీకరించినట్లు తెలిపారు.













