Draupadi Murmu : రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న ఏపీ మంత్రి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ (Narayana) స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డులు అందుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఐదు అవార్డులకు రాష్ట్రంలోని 5 నగరాలు ఎంపికయ్యాయి. జీవీఎంసీ, విజయవాడ (Vijayawada), రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లకు అవార్డులు దక్కాయి. కార్పొరేషన్ల కమిషనర్లతో కలిసి మంత్రి నారాయణ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి మనోహర్‌లాల్ (Manoharlal) , ఏపీ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి (Chairman Pattabhi) తో పాటు ఆయా కార్పొరేషన్ల అధికారులు పాల్గొన్నారు.













