Chandrababu:ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

స్వచ్ఛత అంటే శుభ్రతే కాదు, అన్ని కోణాల్లోనూ చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సు (Collectors Conference)లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ను ఉద్యమంగా చేపట్టనున్నట్లు తెలిపారు. మొదటిసారి సింగపూర్ (Singapore) వెళ్లి అక్కడి పరిస్థితిని అధ్యయనం చేశాను. హైదరాబాద్ (Hyderabad) లో నైట్ క్లీనింగ్‌ను కూడా ప్రారంభించాం పొరుగుసేవల సిబ్బందిని నియమించడం కూడా అదే తొలిసారి. గతంలో ప్రధాని (Prime Minister) నాకు అవకాశమిస్తే, స్వచ్ఛభారత్‌పై రిపోర్టు కూడా ఇచ్చాను. సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై అధికారులు దృష్టి పెట్టాలి. జనవరి 1 నుంచి అనవసర చెత్త కనపడితే ఊరుకునేది లేదు. ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని కలెక్టర్లకు సూచించారు.