Supreme Court : ఏపీలో డీఎస్సీ, టెట్‌కు లైన్ క్లియర్ … యథావిధిగా షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ(DSC), టెట్ (TET )కు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే విడుదలైన డీఎస్సీ షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతూ ఆరుగురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు లేవనెత్తిన అంశాల్లో సరైన కారణాలు లేవని అభిప్రాయపడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. ఏవైనా సమస్యలు ఉంటే హైకోర్టు (High Court) లోనే పిటిషన్ దాఖలు చేయాలని జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం సూచించింది. టెట్, డీఎస్సీ షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల (Teacher posts) భర్తీకి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 6 నుంచి జులై 6 వరకు సీబీటీ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.













