జగన్ ఆక్రమాస్తుల కేసులపై.. సీబీఐకి సుప్రీం నోటీసులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐకి నోటీసులు జారీ చేసిన సుప్రీం.. కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని ప్రశ్నించింది. రఘురామ వేసిన కేసుల బదిలీ పిటిషన్ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, సహా ప్రతివాదులుగా ఉన్న అరబిందో, హెటిరో గ్రూప్, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్, ఎం.శ్రీనివాసరెడ్డి, కె.నిత్యానంద రెడ్డి, పి.శరత్ చంద్రారెడ్డి, బీపీ ఆచార్య, యద్దనపూడి విజయలక్ష్మి, పీఎస్ చంద్రమౌళి, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు జనవరికి వాయిదా వేసింది.













