Supreme Court: చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కాం కేసు లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (Chevireddy Mohit Reddy) కి సుప్రీంకోర్టు (Supreme Court) లో ఊరట లభించింది. లిక్కర్ కేసులో మధ్యంతర రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ని గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేశారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. తుడా చైర్మన్‌గా ఉండగా మద్యం ముడుపులు తరలించేందుకు అధికార వాహనాలు వాడారని చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోసుప్రీంకోర్టు ప్రతివాదులకి నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణ వరకూ మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. కేవలం తన పేరుతో ఉన్న కారులో డబ్బు పట్టుబడిందని, ఆంధ్రప్రదేశ్‌పోలీసులు ఆయనపై కేసు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారని న్యాయస్థానానికి మోహిత్‌రెడ్డి న్యాయవాది తెలిపారు. ఇదే కేసులో తన తండ్రి జైల్లో ఉన్నారని, తనని కూడా పంపాలని చూస్తున్నారని మోహిత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. మోహిత్‌రెడ్డి వాదనలను ఖండించారు ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి (Mukul Rohatgi). మోహిత్‌రెడ్డిని అరెస్ట్ చేసింది కారు పట్టుకున్నందుకు కాదని, కారులో పెద్ద మొత్తంలో డబ్బులని అక్రమంగా తరలిస్తున్నందుకు కేసు నమోదు చేశారని గుర్తు చేశారు.