SC: సుప్రీంకోర్టులో సురేష్ ప్రొడక్షన్స్ కు బిగ్ షాక్
విశాఖలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గతంలో ఫిల్మ్‌సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చని జగన్ ప్రభుత్వం సురేష్ ప్రొడక్షన్స్‌కు అనుమతించింది. ఈ క్రమంలో గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రస్తుత ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీన్ని సురేష్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం పిటిషన్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. మధ్యంతర ఉపశమనం కుదరదని తేల్చి చెప్పింది. అవసరం అనుకుంటే, ప్రభుత్వ షోకాజ్ నోటీసుపై సంబంధిత కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. మరోవైపు పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని సురేష్ ప్రొడక్షన్స్ కోరగా, ధర్మాసనం అనుమతించింది.













