ఏపీ ప్రభుత్వం పిటిషన్ పై.. తెలంగాణ, కేంద్రంకు సుప్రీంకోర్టు నోటీసులు
విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలను తక్షణమే విభజించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. 2014లో ఏపీ విభజన సమయంలో పార్లమెంట్లో ఏపీ పునర్విభజన చట్టం ఆమోదించారు. అందులో పేర్కొన్న విధంగా షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన ఇప్పటికే పూర్తి కాలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఈ రెండు షెడ్యూల్‌కు సంబంధించి దాదాపు 91 శాతం సంస్థలు తెలంగాణలోనే ఉన్నాయని ఏపీ ప్రభుత్వం సుప్రీంకి నివేదించింది. విభజన అంశంలో తెలంగాణ నుంచి సహకారం లేదని కోర్టుకు వివరించింది. దీంతో విభజన వ్యవహారం ఆలస్యం జరుగుతోందని పేర్కొంది. ఈ సంస్థలను వెంటనే చట్టం ప్రకారం విభజన జరిగే చర్యలు తీసుకోవాలని సుప్రీంను కేంద్రం కోరింది. ఈ పిటిషన్ లో తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులుగా ఉన్న కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.













