Supreme Court: కాకాణికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
క్వార్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Kakani Govardhan Reddy) కి సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ (Bail) ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. క్వార్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితరాలపై పొదలకూరు పోలీసుస్టేషన్ (Podalakur Police Station) లో ఆయనపై ఫిబ్రవరిలో కేసు నమోదైంది. కాకాణి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. గతంలో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు (AP High Court) నిరాకరించింది.













