ఎల్జీ పాలిమర్స్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
సుప్రీంకోర్టులో ఎల్జీ పాలిమర్స్ కు మరోసారి చుక్కెదురైంది. ఫ్యాక్టరీని సీజ్ చేయాలని ఆంధప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఎల్జీ పాలిమర్స్ ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏ వాదనలనైనా హైకోర్టు, ఎన్జీటీ ముందే వినిపించాలని ఎల్జీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎల్జీ పాలిమర్స్‌ను సీజ్ చేయాలని హైకోర్టు ఏకపక్షంగా ఆదేశించిందని, కంపెనీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ముకుల్ వాధనలను ధర్మాసనం తోసిపుచ్చుతూ తాజా ఆదేశాలు జారీ చేసింది.













