రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఇలాంటి ఎమ్మెల్యేలను
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం సమస్యలపై నిర్వహించిన బీజేపీ ఛార్జ్‌షీట్ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారికి విశిష్టత కలిగిన సంక్రాంతి పండుగను సైతం క్యాసినో, క్యాబిరే డ్యాన్స్‌లుగా మార్చేశారని, గుడివాడ యువతను కొడాలి నాని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. కొడాలి నానీని జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా చేయాలని గుడివాడ ప్రజలకు సునీల్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇలాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతామన్నారు. బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడని, ఇలాంటి ఎమ్మెల్యే కారణంగా ఆంధ్ర్రప్రదేశ్ పరువుపోతోందన్నారు.













