తండ్రి హత్య కేసు పై మరొకసారి సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించిన సునీత..
మాజీ మంత్రి.. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్య కేసు ఈరోజుకి కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఓ సంచలనం. వివేకానంద రెడ్డి హత్య ను తమ రాజకీయ ప్రచారానికి అనుకూలంగా వాడడానికి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో మరొక తాజా అప్డేట్ వైరల్ అవుతుంది. వివేకానంద రెడ్డి కూతురు సునీత మరొకసారి తండ్రి హత్య కేస్ విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నిందితుడిగా పరిగణించిన శివశంకర్ రెడ్డి అనే వ్యక్తికి ఇటీవల తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్ రద్దు చేయవలసిందిగా సునీత పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఈరోజు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ చేపడతారు.













